సామర్లకోట: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చేసిన చీకటి చట్టాలపై నిరంతరం పోరాటం చేస్తామని రాక్స్ అండ్ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ తెలిపారు. శుక్రవారం స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతుందన్నారు. ఈ కుట్ర వెనుక ప్రధాని మోదీతో పాటు తెలుగు రాషా్‌ట్రల సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఉన్నారని ఆరోపించారు. మోదీ చేసిన చట్టాలను మార్పు చేసే వరకూ పోరాటం ఆగదని హెచ్చరించారు. సామాజిక న్యాయం చేయాలనుకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని పవన్‌కల్యాణ్ ఇవ్వాలని అన్నారు. దళితులను తెలంగాణలోని కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి, ఆంధ్రలో చంద్రబాబు నమ్మించి మోసం చేశారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌ల కుట్ర దాగి ఉందన్నారు. 2004లో చంద్రబాబు చట్టం చేస్తే అది చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేసేందుకు ఉద్యమం సామర్లకోట నుంచి ప్రారంభం అవుతుందన్నారు. వర్గీకరణ పేరుతో 100 మందిలో ఇద్దరికే లబ్ధి చేస్తున్నారని, కనీసం 10 మందికి లబ్ధి జరిగే విధంగా చేయాలని డిమాండ్ చేశారు. దీనిని సాధించే వరకూ అందరూ పోరాటానికి సిద్ధం కావాలన్నారు. సమావేశంలో మాల మహానాడు నాయకులు నేతల హరిబాబు, లింగం శివ, కొప్పుల ప్రేమ్‌బాబు, నెలి సూరిబాబు, బత్తుల రాంప్రసాద్, బీపెల్లి పండు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.


