ఘాట్‌ రోడ్డులో మినీ బస్సు బోల్తా | - | Sakshi
Sakshi News home page

ఘాట్‌ రోడ్డులో మినీ బస్సు బోల్తా

May 30 2026 2:44 AM | Updated on May 30 2026 2:44 AM

పది మందికి గాయాలు

చింతూరు: మారేడుమిల్లి, చింతూరు ఘాట్‌ రోడ్డులో ప్రయాణికులతో వెళుతున్న మినీ ట్రావెల్‌ బస్సు శుక్రవారం ఉదయం బోల్తా పడిన ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. కాకినాడ జిల్లా కోలంక, తూర్పుగోదావరి జిల్లా మండపేట, నిడదవోలుకు చెందిన 13 మంది సీతారాముల దర్శనం నిమిత్తం మినీ బస్సులో భద్రాచలం వెళ్తున్నారు. ఈ క్రమంలో ఘాట్‌ రోడ్డులో టైరు పంక్ఛర్‌ కావడంతో బస్సు రహదారిపై బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలు కావడంతో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రైవేటు బస్సులో చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయాలైన వారిలో ఎనిమిది మందికి సాధారణ గాయాలకు కాగా, ఇద్దరికి ఎముకలు విరిగినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కోటిరెడ్డి తెలిపారు. గాయాలైన వారిలో కోలంకకు చెందిన సత్యకల్యాణి, సుగుణ, సూర్యకుమార్‌, నాగేంద్ర, హైమావతి, నిడదవోలుకు చెందిన భరణి, సావిత్రదేవి, మండపేటకు చెందిన దేవి, జోగరత్నం, శివరామ్‌ ఉన్నారు. చింతూరు ఎస్సై సంతోష్‌కుమార్‌ ఆసుపత్రికి వెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement