ప్రజలు మెచ్చే పనులేవీ చేయని కూటమి నాయకులు ప్రచారం మాత్రం పీక్స్‌లో చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రజలకు నిత్యం తమ ముఖాలు మాత్రమే కనిపించేలా భారీ ఫ్లెక్సీలు వేయిస్తున్నారు. వీటిని ఆయా నాయకుల స్థలాల్లో ప్రదర్శించుకుంటే ఎవ్వరికీ అభ్యంతరాలుండవు. కానీ, ఏకంగా సచివాలయాన్నే మూసివేసేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. కడియం మండలం జేగురుపాడు పంచాయతీలో అమ్మవారి జాతర శుభాకాంక్షల నెపంతో.. జనసేన, టీడీపీ నాయకులు తమ ఫ్లెక్సీలను నేరుగా గ్రామ సచివాలయానికే కట్టేశారు. సచివాలయం బోర్డును కూడా మూసివేసేలా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటువంటి బరితెగింపు వ్యవహారాలపై అభ్యంతరం చెప్పాల్సిన అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి టాస్క్‌ఫోర్స్


