● ఆర్‌జేడీ నాగమణి ● డీవైఈఓ, ఎంఈఓలకు ఒకరోజు శిక్షణ
● రూ.9 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు..
● రూ.80 వేల నగదు అపహరణ
రాజమహేంద్రవరం రూరల్: పాఠశాలల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, నాణ్యమైన బోధనా పద్ధతులు మెరుగు పరచడానికి నిరంతర పర్యవేక్షణ అవసరమని జోన్–2 ప్రాంతీయ విద్యా సంచాలకురాలు జి.నాగమణి పేర్కొన్నారు. పాఠశాలల పర్యవేక్షణపై జోన్–2 పరిధిలోని డీవైఈవోలు, ఎంఈవోలకు బుధవారం స్థానిక ఫ్యూచర్ కిడ్స్ పాఠశాలలో ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్సనలైజ్డ్ అడాప్ట్ లెర్నింగ్ (పాల్ ) ఎలా నిర్వహించాలి.. విద్యార్థుల సామర్‌ాధ్యలను ఎలా బలోపేతం చేయాలన్న అంశాలపై శిక్షణ ఇచ్చారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పటిష్ట అమలుకు నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచించారు. రాష్ట్ర పాల్ సమన్వయకర్త కిశోర్ బాబు, సీమాట్ సీనియర్ లెక్చరర్ ఎస్.ప్రసాద్, సమగ్ర శిక్ష సీనియర్ ఫ్యాకల్టీ మాధవీలత ఈ శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈఓ కంది వాసుదేవరావు, జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ఎస్.సుభాషిణి, తూర్పుగోదావరి జిల్లా అకాడమిక్ మోనిటరింగ్ ఆఫీసర్ లక్ష్మణ్ కుమార్, సుమారు 200 మంది ఎంఈవోలు, డీవైఈఓలు, మానిటరింగ్ అధికారులు పాల్గొన్నారు.
నడకుదురులో భారీ చోరీ
కరప: మండలం నడకుదురులో భారీ దొంగతనం జరిగింది. ఇంటి తాళాలు బద్దలు కొట్టి లోపలి బీరువాలో బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరణకు గురైనట్టు పోలీసులు తెలిపారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు నందిగాన అరుణ్‌కుమార్, కోకిల దంపతులు నడకుదురులో నివసిస్తున్నారు. అరుణ్‌కుమార్ కాకినాడలో వైన్‌షాపులో పనిచేస్తుండగా, కోకిల అదే గ్రామంలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నది. ఆమె ఈ నెల 22న బ్యుటీషియన్ తరగతుల నిమిత్తం విజయవాడ వెళ్లారు. ఈ నెల 25న అరుణ్‌కుమార్ వేసవి సెలవులకు విశాఖ వెళ్లి తన పిల్లలను తీసుకువచ్చేందుకు విశాఖ వెళ్లారు. 26న కోకిల తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరచి ఉండి బీరువా సైతం తెరిచి ఉంది. అందులోని 54 గ్రాముల బంగారు, 400 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.80 వేల నగదు చోరీకి గురైనట్టు ఆమె గుర్తించింది. సీసీ ఫుటేజీని పరిశీలించగా టోపీ ధరించిన వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై టి.సునీత సిబ్బందితో వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోక్సో కేసు నమోదు
దేవరపల్లి: నల్లజర్ల పోలీస్ స్టేషన్‌లో ఓ యువకుడిపై బుధవారం పోక్సో కేసు నమోదైంది. తన కుమార్తైపె అత్యాచారం చేసిన కొక్కిరిపాటి కిరణ్ కుమార్‌పై ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రవికుమార్ తెలిపారు.


