ఆరు ఇసుక లారీల సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

ఆరు ఇసుక లారీల సీజ్‌

May 28 2026 12:22 AM | Updated on May 28 2026 12:22 AM

సీతానగరం: మండలంలోని రఘుదేవపురం ర్యాంపు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు లారీలను మైన్స్‌ ఏడీ ఫణి భూషణ్‌రెడ్డి, అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌ విఘ్నేష్‌ మంగళవారం అర్ధరాత్రి సీజ్‌ చేశారు. రాత్రి సమయంలో ఇసుక రవాణ చేస్తున్న లారీలను అడ్డుకుని వాటి బిల్లులు పరిశీలించారు. వే బిల్లులు లేకుండా తరలిస్తున్న లారీలు, కొన్ని లారీలకు ఉదయం ఇచ్చిన వే బిల్లులు ఉండటంతో లారీలను సీజ్‌ చేసి సీతానగరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రికార్డుల పరిశీలన అనంతరం లారీలకు జరిమానా విధించామని వారు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement