ఆటో కార్మికుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

ఆటో కార్మికుల ధర్నా

May 27 2026 12:17 AM | Updated on May 27 2026 12:17 AM

నిడదవోలు : పది రోజుల్లో 4 విడతలుగా పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ పట్టణంలో ఆటో కార్మికులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగిన ఽపెట్రో ధరలతో రవాణా చార్జీలు పెరిగి నిత్యవసరాల ధరలు కూడా పెరగడంతో ఽపేదల బాతుకులు చిన్నాభిన్నం అయ్యాయన్నారు. ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతీస్తూ వారి జీవితాలతో ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయని విమర్శించారు. ఆటో, లారీ, మోటార్‌ ఫీల్డు కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎన్నికల గెలుపే లక్ష్యంగా ఉచిత బస్సు పథకం తెచ్చిన నేపథ్యంలో ఆటో కార్మికులు అర్ధాకలి జీవితాలు గడుపుతున్నామన్నారు. పాలకులు బడా పెట్టుబడిదారులకు ఇస్తున్న వివిధ రాయితీల మాదిరిగా రవాణా వాహనాల కార్మికులకు పెట్రోల్‌, డీజిల్‌ తగ్గింపు ధరలకు అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఈమని గ్రీష్మకుమార్‌, తీట్ల సతీష్‌ , నాగరాజు, గాలింకి సురేష్‌, హుస్సేన్‌, కరుణ, మద్దాల శ్రీను, ఆరిఫ్‌ పాల్గొన్నారు.

ఓపెన్‌ స్కూలు

పరీక్షలు వాయిదా

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఈ నెల 28న జరగాల్సిన పది, ఇంటర్‌ ఓపెన్‌ స్కూలు పరీక్షలు బక్రీదు కారణంగా వాయిదా వేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు మంగళవారం తెలిపారు. తిరిగి ఈ పరీక్షలు జూన్‌ 2వ తేదీన జరుగుతాయన్నారు. పదవ తరగతి గణితం, భారతీయ సంస్కృతి, వారసత్వం పరీక్ష, ఇంటర్‌లో రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయన్నారు. ఇంటర్‌ థియరీ పరీక్షలను వచ్చే నెల 2 కు వాయిదా వేసిన కారణంగా ప్రాక్టికల్‌ పబ్లిక్‌ పరీక్షలు 7వ తేదీకి వాయిదా పడ్డాయన్నారు.

పూతరేకుల

దుకాణాల్లో తనిఖీలు

ఆత్రేయపురం: ఉచ్చిలి, ఆత్రేయపురం సమీపంలోని పూతరేకుల తయారీ, విక్రయాలు జరిపే దుకాణాల్లో మంగళవారం ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి వై.రామయ్య ఆధ్వర్యంలో అధికారులు ఆయా దుకాణాల్లో వినియోగిస్తున్న నెయ్యిని పరిశీలించారు. స్థానికంగా కొందరి నుంచి కల్తీ నెయ్యిపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆరోగ్య సిబ్బందితో కలిసి దుకాణాల్లో వినియోగిస్తున్న నెయ్యి నమూనాలను సేకరించారు. వీటిని పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపించి, రిపోర్టులు వచ్చిన అనంతరం కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే కేసులు నమోదు చేస్తామని వై.రామయ్య తెలిపారు. పూతరేకుల పరిశ్రమ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినందున ఇక్కడి తయారీదారులు బ్రాండెడ్‌ నెయ్యిని మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నందున నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వ్యాపారులకు తెలిపారు. తనిఖీలో వైద్య శాఖ సిబ్బంది పీహెచ్‌ అరుణకుమారి, సూపర్‌ వైజర్‌ మూర్తి, వీఆర్వో జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement