జాతీయ బీచ్‌ వాలీబాల్‌ జట్టు కెప్టెన్‌గా రామకృష్ణంరాజు | - | Sakshi
Sakshi News home page

జాతీయ బీచ్‌ వాలీబాల్‌ జట్టు కెప్టెన్‌గా రామకృష్ణంరాజు

May 27 2026 12:17 AM | Updated on May 27 2026 12:17 AM

ఆత్రేయపురం: భారత పురుషుల బీచ్‌ వాలీబాల్‌ జట్టు కెప్టెన్‌గా మండలంలోని తాడిపూడికి చెందిన ముదునూరి రామకృష్ణంరాజు ఎంపికయ్యారు. చైనాలో ఈ నెల 4 నుంచి 7 వరకు జరిగే ఏబీసీ సీనియర్‌ ఆసియన్‌ బీచ్‌ వాలీబాల్‌ జట్టుకు కెప్టెన్‌గా ఆయన వ్యవహరిస్తారు. ఈయన తండ్రి శివాజీ రాజు గతంలో హైదరాబాద్‌ బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగం చేస్తూ ఆటలు పోటీలకు కోచ్‌గా వ్యవహరించారు. కాగా.. రామకృష్ణంరాజు ఎంపికపై ఈ ప్రాంత ప్రముఖులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జట్టులో ఈ ప్రాంతానికే చెందిన పెన్మత్స కృష్ణ చైతన్య సభ్యుడు కావడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement