ఉత్తమ నర్తకిగా త్రినయని | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ నర్తకిగా త్రినయని

May 26 2026 3:02 AM | Updated on May 26 2026 3:02 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): దక్షిణ భారత దేశ ఉత్తమ నర్తకిగా త్రినయని ఎంపికై ంది. ద స్టార్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ ఆదివారం విశాఖపట్నంలో దక్షిణ భారత స్థాయి శాసీ్త్రయ నృత్య పోటీలను నిర్వహించింది. ఇందులో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకకు చెందిన కూచిపూడి నర్తకీమణులు పోటీ పడ్డారు. కాకినాడకు చెందిన కూచిభొట్ల త్రినయని ప్రథమ స్థానాన్ని, స్టార్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా అవార్డును కై వసం చేసుకుంది. దక్షణాది రాష్ట్రాల్లో వెయ్యి మందికి పైగా కూచిపూడి నర్తకీమణులు తమ నృత్య వీడియోలు ద స్టార్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ వారికి పంపగా, న్యాయ నిర్ణేతలు పరిశీలించారు. ఇందులో కూచిపూడి విభాగం నుంచి 16 మందిని ఎంపిక చేసి ప్రత్యక్షంగా పోటీలు నిర్వహించగా, కాకినాడకు చెందిన నాట్యాచార్యులు కృష్ణకుమార్‌ శిష్యురాలు త్రినయని ప్రథమ స్థానం సాధించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నృత్య పోటీల్లోనూ ప్రథమ బహుమతి, ఉత్తమ నర్తకి అవార్డు గెలుచుకుంది. తన సహచర నర్తకీమణులతో కలసి ఆమె ఈ నెల 28న ఊటీలో, కొడైకెనాల్‌లో నృత్య ప్రదర్శనకు వెళుతున్నట్లు నాట్యాచార్య కృష్ణకుమార్‌ తెలిపారు. జూన్‌ 3న శ్రీలంకలోని కొలంబోలో అంతర్జాతీయ నృత్యోత్సవాల్లో పాల్గొనుందని వివరించారు.

హత్య కేసులో వ్యక్తికి

యావజ్జీవ శిక్ష

తుని: ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో ముద్దాయికి యావజ్జీవ శిక్ష పడిందని తుని పట్టణ ఎస్సై ఎం.గీతా రామకృష్ణ సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. స్థానిక రైల్వేగెస్ట్‌ హౌస్‌ వద్ద 2024లో ఏప్రిల్‌ 25న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందని అప్పట్లో వీఆర్వో ఆదిలక్ష్మి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం విచారణలో మృతుడు భిక్షాటన చేసుకునే డేవిడ్‌రాజ్‌గా తేలింది. అతనికి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లికి చెందిన యడ్ల అప్పారావు రూ.1500 ఇచ్చారు. తిరిగి అడిగినందుకు వారిద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో డేవిడ్‌రాజుపై కక్ష పెంచుకుని అప్పారావు దాడిచేసి హత్య చేసి పరారయ్యాడు. పిఠాపురం ఏడో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టులో కేసు విచారణ జరగ్గా, నేరం రుజువు కావడంతో ముద్దాయి అప్పారావుకు జడ్జి పి.భాస్కరరావు యావజ్జీవ శిక్షతో పాటు రూ.ఐదు వేల జరిమానా విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement