పిట్టల్లా రాలిపోతున్న జనం | - | Sakshi
Sakshi News home page

పిట్టల్లా రాలిపోతున్న జనం

May 26 2026 3:02 AM | Updated on May 26 2026 3:02 AM

వడదెబ్బకు నలుగురి మృతి

రాజవొమ్మంగి/ కరప/ జగ్గంపేట/ : వడదెబ్బ మృతుల రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు అంతకంతకూ పెరుగుతుండడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం నలుగురు మృతి చెందారు. పోలవరం జిల్లా రాజవొమ్మంగికి చెందిన జలగం ఆదిలక్ష్మి (76) సోమవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి అస్వస్థతకు గురై మృతి చెందింది. వడగాల్పుల కారణంగా వాంతులు అయ్యాయని, ఆసుపత్రికి తరలించేలోగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఫ కాకినాడ రూరల్‌ కూరాడ గ్రామానికి చెందిన టేకుమూడి సూర్యనారాయణ (80) పంట కాలువలో పూడికతీత పనికి వెళ్లాడు. పని పూర్తయిన తర్వాత సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా వేసవి తాపానికి తట్టుకోలేక మార్గం మధ్యలోనే మృతి చెందాడు.

ఫ జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో పొలంలో గేదెలు మోపడానికి వెళ్లిన పాలిపిరెడ్డి నూకరాజు (52) వడదెబ్బకు పొలంలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

ఫ వడదెబ్బకు గురై తొండంగి గ్రామానికి చెందిన నేమాల నూకరాజు (55) మృత్యువాత పడ్డారు. నూకరాజుకు స్వల్పంగా అనారోగ్యంగా ఉండటంతో కాకినాడ ఆస్పత్రికి వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నారు. వడదెబ్బకు గురై అపస్మారక స్ధితికి చేరుకోగా స్థానిక వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement