గురి తప్పని బాణాలు | - | Sakshi
Sakshi News home page

గురి తప్పని బాణాలు

May 26 2026 3:02 AM | Updated on May 26 2026 3:02 AM

జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో ప్రతిభ

పిఠాపురం: మాటలు నేర్చుకునే వయసులో ఆటలు ఆడారు. మేథస్సు అంటే ఏంటో తెలియని వయసులో ధనుస్సు పట్టుకుని బాణం ఎక్కుపెట్టి లక్ష్యాన్ని అలవోకగా చేరారు. పిల్లలు కాదు చిచ్చర పిడుగు అనిపించుకున్నారు. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకూ గోవాలో జరుగుతున్న ఫస్ట్‌ ఆలిండియా ఓపెన్‌ ఇండోర్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పిఠాపురం నుంచి ఇండియన్‌ రౌండ్‌ విభాగంలో అండర్‌ టెన్‌ విభాగంలో సీహెచ్‌ అశ్విన్‌, కె.సంపత్‌ జై, సీహెచ్‌ హనీత్‌ రతన్‌ పాల్గొని కాంస్య పతకాలు సాధించారు. పదేళ్ల లోపు వయసులో జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికై పతకాలను సాధించిన చిన్నారులను, వీరిని తీర్చిదిద్దిన ఆర్చరీ కోచ్‌ లక్ష్మణరావును పలువురు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement