ఫ అదీ సంగోతి | - | Sakshi
Sakshi News home page

ఫ అదీ సంగోతి

May 25 2026 3:28 AM | Updated on May 25 2026 3:28 AM

కుడితిలో పడిన ఎలుక బయటకు రావడానికి నానా పాట్లూ పడుతుంది. అలాగే, ఈ పల్లెవెలుగు బస్సు అనుకోకుండా నడి రోడ్డుపై ఉన్న ఓ గోతిలో దిగబడిపోయింది. గోపాలపురం మండలం దొండపూడి నుంచి ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఆదివారం రాజమహేంద్రవరానికి బయలుదేరింది. దొండపూడి సెంటర్‌కు చేరగానే.. అక్కడ రోడ్డుపై ఉన్న ఓ గోతిలో వెనుక చక్రం పడింది. డ్రైవర్‌ ఎంతసేపు ప్రయత్నించినా ఆ బస్సు గోతిలో నుంచి బయటకు రాలేదు. దీంతో, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. చివరకు ఓ ట్రాక్టర్‌తో గ్రామస్తులు ఆ బస్సును గోతిలో నుంచి బయటకు లాగడంతో గమ్యానికి బయల్దేరింది. ఇంతకూ గోతుల్లేని రోడ్లే తమ లక్ష్యమని ఘనంగా ప్రకటించిన కూటమి సర్కారు వారు ఈ గోతిపై ఏం చెబుతారో మరి!

– దేవరపల్లి

Advertisement
 
Advertisement
Advertisement