అలరించిన ‘గజల్‌’ గానం | - | Sakshi
Sakshi News home page

అలరించిన ‘గజల్‌’ గానం

May 25 2026 3:28 AM | Updated on May 25 2026 3:28 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): స్థానిక సూర్య కళా మందిరంలో గజల్‌ శ్రీనివాస్‌ ఆలపించిన గజల్స్‌ నగర వాసులను అలరించాయి. సరస్వతీ గానసభ, గజల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యాన తెలుగు గజల్స్‌ లెజెండ్‌, గిన్నిస్‌ ప్రపంచ రికార్డులు సాధించిన మాస్ట్రో గజల్‌ శ్రీనివాస్‌చే 40 వసంతాల గజల్‌ గాన ఉత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని గజల్‌ శ్రీనివాస్‌తో పాటు సరస్వతీ గానసభ జీవితకాల అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీరామనరసింగరావు, గౌరవాధ్యక్షురాలు పెద్దాడ సూర్యకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ, 40 సంవత్సరాలుగా తన గజల్స్‌తో నిర్విరామంగా తెలుగు ప్రేక్షక శ్రోతలను మైమరపింపజేయడం శ్రీనివాస్‌కే సాధ్యమన్నారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ, 125 సంవత్సరాలుగా నిర్విరామంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ, తెలుగు వారు గర్వించదగిన సరస్వతీ గానసభలో గజల్స్‌ గానం చేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. అనంతరం ఆయన పలు గజల్స్‌తో పాటు భక్తిగీతాలను ఆలపించారు.

Advertisement
 
Advertisement
Advertisement