తంటికొండలో సినీ సందడి | - | Sakshi
Sakshi News home page

తంటికొండలో సినీ సందడి

May 25 2026 3:28 AM | Updated on May 25 2026 3:28 AM

గోకవరం: మండలంలోని తంటికొండ గ్రామంలో ప్రసిద్ధి గాంచిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సినీ సందడి నెలకొంది. ప్రముఖ హీరో విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న నూతన సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. టీసీ సుగుమార్‌ దర్శకత్వంలో చిత్రీకరిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ నటి లక్ష్మీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రొడక్షన్‌ మేనేజర్‌ బాబి ఆధ్వర్యంలో ఆలయానికి వచ్చిన చిత్ర యూనిట్‌ను దేవస్థానం చైర్మన్‌ బద్దిరెడ్డి అచ్చన్నదొర ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతించి, స్వామివారి ప్రసాదం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement