గోకవరం: స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో ఆదివారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వన్నేటి వెంకటేశ్వరరావు (53) గోకవరంలో ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. సింగారమ్మ చింత ఆలయం వద్ద భోజనానికి వెళ్లి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో సాయంత్రం మృతి చెంది ఉన్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై పవన్‌కుమార్ అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతికి గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


