జెడ్పీలో పలువురికి ఉద్యోగోన్నతులు | - | Sakshi
Sakshi News home page

జెడ్పీలో పలువురికి ఉద్యోగోన్నతులు

May 23 2026 12:28 AM | Updated on May 23 2026 12:28 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లకు, ఐదుగురు జూనియర్‌ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతులు కల్పిస్తూ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు శుక్రవారం నియామక పత్రాలు అందజేశారు. ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లకు పరిపాలనాధికారులుగా, ఐదుగురు జూనియర్‌ అసిస్టెంట్లకు సీనియర్‌ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించామని వివరించారు. అలాగే, జెడ్పీ యాజమాన్యంలో పని చేస్తూ అకాల మరణం చెందిన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామక పత్రాలను కూడా ఆయన అందజేశారు. ఉద్యోగోన్నతి పొందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, జిల్లా పరిషత్‌కు మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement