రయ్‌ రయ్‌ రారా.. | - | Sakshi
Sakshi News home page

రయ్‌ రయ్‌ రారా..

May 23 2026 12:28 AM | Updated on May 23 2026 12:28 AM

ఉత్సాహంగా రోలర్‌ స్కేటింగ్‌

ఉదయం, సాయంత్రం వేళల్లో శిక్షణ

వేసవి శిక్షణకు 300 మంది హాజరు

కాకినాడలోని వైఎస్సార్‌

స్కేటింగ్‌ రింక్‌లో ఓనమాలు నేర్చుకుంటున్న చిన్నారులు

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): కాకినాడలోని వైఎస్సార్‌ మున్సిపల్‌ స్కేటింగ్‌ రింక్‌లో వేసవి శిక్షణ తరగతులు ఉత్సాహంగా జరుగుతున్నారు. ఇక్కడ నాలుగేళ్ల నుంచి 18 ఏళ్లలోపు బాల బాలికలకు రోలర్‌ స్కేటింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. వేసవి నేపథ్యంలో ఉదయం 6 నుంచి 9 వరకూ, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోలర్‌ స్కేటింగ్‌లో ఫ్రీ స్టైల్‌, ఇన్‌లైన్‌ ఫ్రీ స్టైల్‌, స్కేట్‌ బోర్డు, స్కూటర్‌, డౌన్‌హిల్‌, ఆల్‌పేన్‌, స్పీడ్‌లో క్వాడ్‌, ఇన్‌లైన్‌, ఆర్టిస్టిక్‌ విభాగంలో కోచ్‌లు సత్య, చంటి, ఈశ్వర్‌లు శిక్షణ అందిస్తున్నారు. సుమారు 300 మంది చిన్నారులు ఈ వేసవి శిక్షణలో చేరి ఓనమాలు నేర్చుకుంటున్నారు. స్కేటింగ్‌తో పాటు ఫిట్‌నెస్‌లో తర్ఫీదు ఇస్తున్నారు. రోలర్‌ స్కేటింగ్‌ అసోసియేషన్‌ పర్యవేక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్కేటింగ్‌ రింక్‌లో ఈ శిక్షణ జరుగుతుండడంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను స్కేటింగ్‌లో చేర్పించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. వైఎస్సార్‌ స్కేటింగ్‌లో రింక్‌లో శిక్షణ పొందిన ఎంతో మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాయ స్థాయిలో రాణించారు. ఈ నెల 30 వరకూ ఈ వేసవి శిక్షణ తరగతులు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement