● వృషభ వీరంగం | - | Sakshi
Sakshi News home page

● వృషభ వీరంగం

May 23 2026 12:28 AM | Updated on May 23 2026 12:28 AM

26 నుంచి ‘గురుకులాల్లో’ కౌన్సెలింగ్‌

రాజమహేంద్రవరం రూరల్‌: ఏపీ బీఆర్‌ఏజీసెట్‌–2026లో అర్హత సాధించి సీట్లు పొందని విద్యార్థులకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలల్లో ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సమన్వయకర్త జి.రాజకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. ఐదో తరగతి ప్రవేశాల కోసం బాలికలకు ఈనెల 26న కాకినాడ పి.వెంకటాపురంలోని గురుకుల పాఠశాలలో, 27న లక్ష్మీ నరసాపురంలోని గురుకుల పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం బాలికలకు 29వ తేదీన కాకినాడ పి.వెంకటాపురం గురుకుల పాఠశాలలో, బాలురకు 30వ తేదీన ఉదయం లక్ష్మీ నరసాపురంలోని గురుకుల పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. విద్యార్థులు ఏపీ బీఆర్‌ఏజీసెట్‌ అప్లికేషన్‌, హాల్‌ టికెట్‌, అలాట్‌మెంట్‌ కామీ, మార్కుల మెమో, ర్యాంకు కార్డు, ఆధార్‌ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం తదితర పత్రాలు తీసుకురావాలని కోరారు. ప్రవేశ పరీక్ష రాసిన వారు సీటు వచ్చి వేరొక స్కూల్‌ కోరుకుని స్లైడింగ్‌/ట్రాన్స్‌ఫర్‌ పెట్టుకున్న విద్యార్థులు కూడా హాజరుకావాలన్నారు. వివరాలకు పి.వెంకటాపురం ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ఎంజీ ప్రమీలను 94401 16298, లక్ష్మీనరసాపురం ప్రిన్సిపాల్‌ కె.రామును 95157 57614 నంబర్లలో సంప్రదించాలని రాజకుమారి కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement