ప్రజలకు ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు ఇబ్బందులు

May 22 2026 12:12 AM | Updated on May 22 2026 12:12 AM

పెరిగిన నూనె ధరలతో ఊరగాయలు పెట్టాలంటే భయపడుతున్నారు. మార్కెట్లో పచ్చడి మామిడి కాయలున్నా.. కొనుగోలు చేసేవారు లేదు. దీనికి తోడు పాలు, పెరుగు, కూరగాయల ధరలు సైతం పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

– మాణిక్యాంబ, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌,

హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు

బాదుడు డబుల్‌

రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ డబుల్‌ బాదుడు బాదుతోంది. రష్యా 56 డాలర్లకు బ్యారెల్‌ ముడి చమురు ఇస్తూంటే దానిని కాదని అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఆ దేశం నుంచి 120 డాలర్లకు ముడి చమురు కొనడం ద్వారా దేశ ప్రజలపై మరింత భారం మోపుతున్నారు. రాష్ట్రంలో అన్ని నిత్యావసర వస్తువుల ధరలూ పెరిగాయి. ఎన్నికలకు ముందు బాదుడే బాదుడంటూ కూటమి నేతలు ప్రచారం చేశారు. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు ధరలను నియంత్రించలేని స్థితికి చేరారు.

– టి.అరుణ్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి

Advertisement
 
Advertisement
Advertisement