● బస్సు మెట్లు (ఫుట్‌బోర్డ్) భూమి నుంచి 325 మిల్లీమీటర్లకు మించి ఉండకూడదు.
● పిల్లలు ఎక్కే, దిగే సమయంలో ప్రమాదాల బారిన పడకుండా రెయిలింగ్ ఉండాలి.
● బస్సులో పిల్లల కదలికలు తెలుసుకునేందుకు డ్రైవర్ వద్ద అద్దం, అగ్నిమాపక సిలిండర్, తలుపులకు సురక్షిత లాకింగ్ సిస్టం, సిగ్నల్ లైట్లు పనిచేస్తూ ఉండాలి.
● అత్యవసర సమయంలో పగులగొట్టేందుకు సుత్తి ఉండాలి.
● సైడ్ విండోలకు మధ్యలో 31 అంగుళాలకు మించకుండా అడ్డంగా మూడు లోహపు కడ్డీలు ఏర్పాటు చేయాలి. సీటింగ్ కెపాసిటీకి మించి విద్యార్థులను ఎక్కించకూడదు.
● డ్రైవరుకు ప్రతి మూడు నెలలకు బస్సు యాజమాన్యం బీపీ, గుండె, మధుమేహం, కంటి పరీక్షలు చేయించాలి.
కానీ ఇందులో సగం నిబంధనలు కూడా పాటించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
ఏటీఎస్ కేంద్రం
సాక్షి, రాజమహేంద్రవరం: విద్యాసంస్థల బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు తెర తీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్కూల్, కళాశాలల బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ గతంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నడిచేది. ఫిట్‌నెస్ లేకపోతే ధ్రువీకరణ పత్రం జారీని తిరస్కరించేవారు. ఏడాది క్రితం నుంచి ఈ పనిని ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. యువగళం పాదయాత్రలో లోకేష్‌తో పాల్గొన్న వారికి కట్టబెట్టారు. అందులో భాగంగానే ఏడాది క్రితం రాజానగరం వద్ద ఏటీఎస్ (ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్‌నెస్ టెస్టింగ్ స్టేషన్) వెలిసింది. అప్పటి నుంచి అందులోనే వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏటీఎస్ కేంద్రంలో ఫిట్‌నెస్ టెస్ట్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అది కలెక్షన్ కేంద్రంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. ఏదైనా విద్యాసంస్థకు చెందిన బస్సు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలంటే బస్సును ఏటీఎస్, రవాణా శాఖ కార్యాలయం వద్దకు తీసుకెళ్లాలి. అక్కడ 43 రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం ధ్రువీకరణ పత్రం జారీ చేయాలి. కానీ ఇక్కడ అలాంటివేమీ అమలు కావడం లేదన్న ఆరోపణలున్నాయి.
ఇవి ఏవీ?
ప్రతి బస్సులో వెహికల్ లోకేషన్ ట్రాకింగ్ డివైస్ ఉండాలి. 1989 మోటార్ వెహికల్ చట్టం ప్రకారం పానిక్ బట్టన్, ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టం తప్పనిసరి. 2023 మోటార్ వెహికల్ చట్టం ప్రకారం స్కూలు బస్సు మొత్తం తడిసే విధంగా పైపులైను స్పిన్నర్లు ఉండాలి. ఇవేమీ లేకపోయినా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తుండటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
8 టెస్ట్‌లకే పరిమితం
జిల్లా వ్యాప్తంగా సుమారు 1,705 స్కూల్ బస్సులు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే 1,500లకు పైగా బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేశారు. ఏటీఎస్ సెంటర్లో బస్సు ఫిట్‌నెస్ తెలుసుకొనేందుకు 43 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. 8 మాత్రమే నిర్వహిస్తున్నట్లు సమాచారం. ముడుపులు పుచ్చుకుని మిగిలిన వాటిని చేసినట్లు చూపుతున్నారన్న ఆరోపణలున్నాయి. 15 సంవత్సరాల లోపు కాలపరిమితి పూర్తయిన బస్సులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు సమాచారం. కాలపరిమితి ఉన్న బస్సుల నెంబర్లను కాలం చెల్లిన బస్సులకు పెట్టి ఒకే నంబర్‌తో రెండేసి బస్సులు నడుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే కొనసాగితే ఆర్టీఓ అవకతవకలపై గతంలో నెల్లూరు ఘటన రాజమండ్రిలో కూడా పునరావృతం అవుతుందేమో అన్న ఆందోళన నెలకొంది.
స్కూల్ వద్దకే అధికారులు?
జిల్లాలో స్కూల్, కాలేజీ బస్సులపై రవాణా శాఖ ఈ నెల ఒకటో తేదీ నుంచి తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రత్యేక తనిఖీలు కాసుల వర్షం కురిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. అత్యధికంగా బస్సులు కలిగిన కొన్ని స్కూల్స్ వద్దకే వెళ్లి అక్కడే తనిఖీలు చేపడుతున్నట్లు సమాచారం. నిబంధనలను సడలించి ఒక్కొక్క బస్సు నుంచి రూ.7,500 నుంచి రూ.8 వేల వరకు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది.
నిబంధనలు ఇలా..
ఏపీ ఎంవీరూల్ (158(జీ) ప్రకారం విద్యా సంస్థల యాజమాన్యాలు నిబంధనలు పాటించాలి. సంబంధిత వెబ్‌సైట్‌లో స్కూల్ అడ్రస్, సెల్ నంబర్, బస్సు నంబర్, డ్రైవర్ వివరాలు, డ్రైవింగ్ లైసెన్సు, బ్యాడ్జీ, బీమా, ట్యాక్స్‌లతో పాటు వాహన వివరాలు పూర్తిగా పొందుపరచాలి. బస్సులో ఉండే అటెండర్ పేరు, వయసు, ప్రయాణించే పిల్లల సంఖ్య ఉండాలి. డ్రైవర్, అటెండర్ వయసు 18 ఏళ్లకు తక్కువ ఉండకూడదు.
అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా
బస్సుల ఫిట్‌నెస్ పరీక్ష కేంద్రం
రూ.8 వేల చొప్పున వసూలు
ఇష్టారాజ్యంగా స్కూల్ బస్సులకు
ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీ
43 పరీక్షలు నిర్వహించాల్సి
ఉండగా కేవలం 8తోనే సరి
విద్యార్థుల భద్రతపై
తల్లిదండ్రుల ఆందోళన


