ఆత్రేయపురం: కాటన్ బ్యారేజీ బొబ్బర్లంక సమీపంలో బుధవారం మధ్యాహ్నం స్నేహితుడితో కలిసి స్నానానికి దిగిన వెలుకొండ వెంకట చక్రవర్తి (21) నీటిలో మునిగి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి రాజానగరం మండలం రాధేయపాలేనికి చెందిన చక్రవర్తి ఇంటర్ వరకు చదివి, భవన నిర్మాణంలో సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. బుధవారం అతడు స్నేహితులతో స్నానానికి దిగి మృతి చెందడంపై తండ్రి నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులు బోరున వినిపిస్తున్నారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎస్.రాము తెలిపారు. గురువారం పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అందించనున్నట్లు తెలిపారు.


