అసమర్థ పాలనకు నిదర్శనం | - | Sakshi
Sakshi News home page

అసమర్థ పాలనకు నిదర్శనం

May 19 2026 12:34 AM | Updated on May 19 2026 12:34 AM

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు

చంద్రబాబు అసమర్థ పాలనకు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నిదర్శనంగా నిలుస్తాయి. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తక్షణం తగ్గించాలి. రాష్ట్రంలో ఇంధన ధరలు పెరగడంతో ప్రజలపై రూ.3,391 కోట్ల అదనపు భారం పడింది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌ ధరలు అధికం అంటూ ఎన్నికల ముందు పెట్రోల్‌ బంక్‌ ముందు సెల్ఫీలు దిగిన నారా లోకేశ్‌ ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు.

సామాన్యుడి నడ్డి

విరుస్తున్న ప్రభుత్వం

మాజీ ఎంపీ భరత్‌రామ్‌

రాష్ట్రంలో సామాన్యుడి నడ్డి విరిచే కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వం చేస్తోంది. దేశంలోనే అత్యధికంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఏపీలోనే ఉన్నాయి. బాబు, పవన్‌, లోకేశ్‌ ఒక్కో స్పెషల్‌ ఫ్‌లైట్‌లో ఎందుకు తిరుగుతున్నారు. సైకిల్‌ తొక్కుతూ ప్రజలను మోసం చేసేందుకు మంత్రి నిమ్మల రీల్స్‌ చేస్తున్నారు.

వాహనదారులపై భారం

మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు

పెరిగిన ధరల వల్ల పెట్రోల్‌పై రోజూ రూ.3.29 కోట్లు, డీజిల్‌పై రూ.6 కోట్ల అధిక భారం రాష్ట్రంలో వాహనదారులపై పడుతోంది. అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తామని చెప్పిన కూటమి నేతలు గాలికొదిలేశారు.

అభివృద్ధి, సంక్షేమం

గాలికొదిలేశారు

జక్కంపూడి విజయలక్ష్మి

రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి కేవలం రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంతో పోల్చుకునేందుకు కూటమి ప్రభుత్వం సరిపోతుందా?

ధరలు తగ్గించకపోతే

ప్రజలే బుద్ధి చెబుతారు

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు

విజనరీ నాయకుడినని చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు సామా న్య ప్రజలపై భారాలు మోపడంతో ఆయనది ఏ పాటి దూరదృష్టి అన్నది ప్రజలకు అర్థమైంది. ధరలు తగ్గించకపోతే రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.

Advertisement
 
Advertisement
Advertisement