సత్యసాయి ఎంటర్ ప్రైజస్ పేరుతో చేసిన సొమ్ము వసూళ్లకు సంబంధించి బాఽధితులందరికీ న్యాయం చేస్తాను అంటూ నిర్వాహకుడు మోహన్‌కృష్ణ బుధవారం ఒక వీడియో విడుదల చేశారు. 2023లో కొంతమూరులో బ్రాంచ్ ఏర్పాటు చేశానని, తర్వాత రాజమహేంద్రవరంతో పాటు పలు జిల్లాల్లో విస్తరించానన్నారు. ఏడాది కాలం నా వ్యాపారం చాలా బాగా సాగిందని, కొన్ని బ్రాంచ్‌ల వల్ల నేను నష్టపోయానన్నారు. అయితే తాను రూ.కోట్లు వసూలు చేయలేదని, నాకు కట్టకుండా నా వద్ద పనిచేసిన కొందరు సొమ్ము వారి వద్దే ఉంచుకున్నారని వీడియోలో తెలిపారు. తన వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి రాజకీయ నాయకులకు, పోలీసులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానని, బాధితులందరికీ కొద్ది కొద్దిగా సొమ్ము కొంత ఆలస్యంగానైనా చెల్లిస్తానని తెలిపారు.


