వైభవంగా వాడపల్లి వెంకన్న తెప్పోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా వాడపల్లి వెంకన్న తెప్పోత్సవం

Apr 2 2026 7:47 AM | Updated on Apr 2 2026 7:47 AM

ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి గౌతమి గోదావరిలో స్వామి వారి తెప్పోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం రాత్రి విద్యుద్దీపాలు, పూలతో అలంకరించిన హంస వాహనంపై మేళ తాళాలు, వివిధ రకాల బృందాల వాయిద్యాలు, భారీ బాణసంచా కాల్పుల నడుమ భక్తజన రంజకంగా తెప్పోత్సవం నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ ముదునూరి వెంకటరాజు, ఈవో, దేవదాయశాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్య చక్రధరరావు ఆలయ అర్చక కమిటీ సభ్యులు వాడపల్లి శేషావతారం, కమిటీ సభ్యులు సిష్టా సూర్య కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement