రోడ్డు దిగబడుతోంది.. ఏ క్షణాన ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన కలిగిస్తోంది. పెదపూడి మండలం చింతపల్లి పరిధిలో ఆర్‌అండ్‌బీ రోడ్డు బెర్ములు పెద్ద కాలువలోకి జారిపోతున్నాయి. నిత్యం చింతపల్లి గ్రామం మీదుగా అటు కాండ్రేగుల, కరప, కాకినాడ.. ఇటు రామచంద్రపురం, జి.మామిడాడ గ్రామాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. –పెదపూడి
ఏముందీ బురదే..
నిత్యం రద్దీగా ఉండే గోపాలపట్నం – తొండంగి ప్రధాన రహదారిలో గుంతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోపాలప ట్నం శివారులో భారీ గుంతలు పడ్డాయి. ఇక్కడ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కొద్ది నెలల క్రితం అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేసినా మళ్లీ మామూలే అయ్యింది. గ్రావెల్, బండ రాళ్లతో టిప్పర్లు వెళ్తుండడంతో కొద్ది రోజులకే ఇలా పాడవుతోంది. రెండు రోజుల క్రితం కొద్దిపాటి చినుకులకే ఇలా బురదగా మారింది. –తొండంగి


