ఆరుగాలం కష్టపడి పండించిన పొగాకు రంగు, నాణ్యత బాగున్నాయి. ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. క్యూరింగ్‌లు ముగింపు దశలో ఉన్నాయి. గ్రేడింగ్‌లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రేడింగ్ చేసిన పొగాకును రైతులు బేళ్లు తయారు చేసి అమ్మకానికి సిద్ధం చేశారు. మార్కెట్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఉత్పత్తి పెరుగుతుంది. మార్కెట్ లాభసాటిగా ఉంటుందని ఆశిస్తున్నాం.
– కరుటూరి శ్రీనివాస్, దేవరపల్లి వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షుడు, సంగాయగూడెం
సగటు ధర రూ.330 ఇవ్వాలి
పొగాకు నాట్లు ఆలస్యంగా జరిగినందున దిగుబడులు తగ్గాయి. తుపాను తర్వాత వేసిన తోటల దిగుబడి తగ్గింది. ఎకరాకు సగటున 9 నుంచి 10 క్వింటాళ్లు వస్తున్నాయి. గత ఏడాది కంటే ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. భూముల కౌలు, బ్యారన్ల అద్దె పెరడంతో 15 నుంచి 20 శాతం పెట్టుబడి పెరిగింది. దీనికి తగ్గట్టుగా మార్కెట్ ఉండాలి. గత ఏడాది కిలో సగటు ధర రూ.311 లభించింది. ఈ ఏడాది రూ.330 వస్తే గిట్టుబాటు అవుతుంది.
– సత్తి జగదీశ్వరరెడ్డి, రైతు సంఘం ప్రతినిధి,
కృష్ణంపాలెం, దేవరపల్లి వేలం కేంద్రం
కొనుగోళ్లకు ఏర్పాట్లు
ఐదు వేలం కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభిస్తున్నాం. గ్రేడింగ్ స మయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. బేళ్లకు న్యూస్ పేపరుకు బదులు బోర్డు సరఫరా చేసిన గోనె పట్టాలనే వాడాలి. రోజూ ఉదయం 8 గంటలకు కాటాలకు బేళ్లు తీసుకురావాలి. మార్కెట్లో అమ్ముడు పోతున్న పొగాకును తీసుకురావాలి. ఈ ఏడాది పొగాకు నాణ్యత బాగుంది. మార్కెట్ కూడా బా గుంటుందని ఆశిస్తున్నాం. లో గ్రేడ్ పొగాకు శాతం తక్కువగా ఉంది. బేలు 150 కిలోలకు మించి ఉండరాదు. ట్రేడర్లకు, అధికారులకు రైతులు సహకరించాలి.
– జె.సుధీర్ కుమార్, టుబాకో బోర్డు రీజినల్
మేనేజర్, రాజమహేంద్రవరం


