అతివేగం.. అదే కారణం | - | Sakshi
Sakshi News home page

అతివేగం.. అదే కారణం

Mar 23 2026 8:31 AM | Updated on Mar 23 2026 8:31 AM

కాకినాడ నుంచి కనిగిరి వెళుతున్న కారును అతివేగంగా నడపడం వల్ల ప్రమాదం జరిగిందని సురక్షితంగా బయటపడిన పరసా కోటేశ్వరరావు తెలిపారు. ప్రమాదానికి నిమిషం ముందు తన కారును ఆ కారు ఢీకొట్టగా చాకచక్యంగా అదుపు చేయడం వల్ల ప్రాణాలను కాపాడుకోగలిగామని, లేదంటే తన కుటుంబం ప్రమాద బారిన పడేదని కోటేశ్వరరావు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో తనతో పాటు భార్య తేజస్విని, కుమారుడు, కుమార్తె, డ్రైవర్‌ ఉన్నట్టు ఆయన వివరించారు. దైవదర్శనానికి ద్రాక్షారామ వెళుతున్నట్టు చెప్పారు. ద్రాక్షారామ భీమేశ్వరస్వామి తన కుటుంబాన్ని కాపాడారంటూ చెప్పారు. చాలా సేపు షాక్‌ నుంచి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు తేరుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement