పిఠాపురం: యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి క్షణం భయం భయంగా ఉందని, తన తోటివారు ఇళ్లకు వెళ్లిపోయారని, తనను కాపాడండంటూ పిఠాపురం పట్టణానికి చెందిన దాకే కుమారి సోషల్ మీడియా ద్వారా వేడుకుంది. పిఠాపురం రథాలపేటకు చెందిన కుమారి కొన్నేళ్ల కిందట జీవనోపాధి నిమిత్తం కువైట్ వెళ్లింది. అయితే ఇటీవల అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియడం లేదని తనను రక్షించాలని ఆమె వేడుకుంటోంది. తన భార్యను ఎలాగైనా స్వస్థలానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని ఆమె భర్త దాసు వేడుకుంటున్నాడు.


