జాతులు, భాషలు వేరైనా మనమంతా భరతమాత బిడ్డలమే అని చాటి చె
కడియపులంకలోని పుల్లా ఆంజనేయులుకు చెందిన శ్రీసత్యదేవ నర్సరీలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మొక్కల అమరిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు రెండు లక్షల మొక్కలతో భారతదేశం ఆకృతిని ఏర్పాటు చేశారు. రైతుల భాగస్వామ్యంతో దేశం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ దీనిని ఏర్పాటు చేసినట్లు నర్సరీ రైతులు తెలిపారు.
– కడియం
కడియం పల్ల వెంకన్న నర్సరీలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మొక్కల కూర్పు ఆకట్టుకుంది. దేశ భక్తిని, ప్రకృతి సౌందర్యాన్ని ఒకే వేదికపై ప్రతిబింబించే విధంగా అశోక చక్రం, రిపబ్లిక్ డే సందేశాన్ని ఆకర్షణీయంగా ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు, జాతీయ పండుగల ప్రాధాన్యం ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసినట్లు నర్సరీ అధినేతలు పల్ల సత్యనారాయణమూర్తి, వెంకటేష్, వినయ్ తెలిపారు.
– కడియం
మామిడికుదురు దీప్తి పాఠశాల విద్యార్థులు పిరమిడ్ ఆకారంలో ఏర్పడి త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ సందడి చేశారు. దేశభక్తిని చాటేలా ఈ ప్రదర్శన సాగింది. విద్యార్థులను కరస్పాండెంట్ డీవీవీ సత్యనారాయణ, ప్రిన్సిపాల్ యక్కలదేవర నాగన్నబాబు, ఉపాధ్యాయులు అభినందించారు.
– మామిడికుదురు
జాతులు, భాషలు వేరైనా మనమంతా భరతమాత బిడ్డలమే అని చాటి చె
జాతులు, భాషలు వేరైనా మనమంతా భరతమాత బిడ్డలమే అని చాటి చె
జాతులు, భాషలు వేరైనా మనమంతా భరతమాత బిడ్డలమే అని చాటి చె


