గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
చింతూరు: ఒడిశా నుంచి కర్నూలు జిల్లాకు గంజాయిని తరలిస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన పశుపల జగన్నాథ్‌ను శనివారం చింతూరు పోలీసులు అరెస్టు చేశారు. సీఐ గోపాలకృష్ణ, ఎస్‌ఐ రమేష్ తమ సిబ్బందితో కలసి స్థానిక బస్టాండు వద్ద వాహనాల తనీఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తారసపడిన జగన్నాథ్‌ను అదుపులోకి తీసుకుని సోదా చేయగా రూ.3 లక్షల విలువైన ఆరు కిలోల గంజాయి లభ్యమైనట్లు ఎస్‌ఐ తెలిపారు.
పీహెచ్‌సీ స్వీపర్ ఆత్మహత్యాయత్నం
కె.గంగవరం: పామర్రు పీహెచ్‌సీలో స్వీపర్‌గా పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన సంగడాల జ్యోతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. స్థానిక ఎస్సై సోమేంద్ర కథనం ప్రకారం.. స్వీపర్‌గా పనిచేస్తున్న జ్యోతి తన భర్త ఎర్రియ్యతో కలసి ఆ పీహెచ్‌సీ వద్దే రాత్రి సమయంలో ఉంటుంది. రోజులానే శుక్రవారం రాత్రి పీహెచ్‌సీ వద్ద జ్యోతి విధులు నిర్వహిస్తుంది. తనకు ఉన్న ఆరోగ్య సమస్యలను గుర్తుతెచ్చుకుని ఒక్కసారిగా పక్కనే ఉంచుకున్న స్పిరిట్‌ను ఒంటిపై వేసుకుని నిప్పు అంటించుకుంది. మంటలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భార్యను గమనించిన ఎర్రియ్య మంటలను ఆర్పి చికిత్స నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
ట్రాక్టర్‌ను ఢీకొన్న వ్యాన్ ˘
● వ్యాన్‌లో పట్టుబడిన 38 పశువులు
● అక్రమ రవాణా గుట్టురట్టు
ఎటపాక: 30వ నంబరు జాతీయ రహదారి నుంచి వెళ్తున్న ట్రాక్టర్‌ను వ్యాన్ ఢీకొట్టిన ఘటన శనివారం నెల్లిపాక వై.జంక్షన్ వద్ద జరిగింది. ప్రమాదానికి కారణమైన వ్యాన్‌లో పశువులు ఉండడంతో అక్రమ రవాణా గుట్టురట్టు అయ్యింది. ఎస్సై అప్పలరాజు కథనం ప్రకారం.. 33 పశువుల లోడుతో వ్యాన్ ఒడిశా రాష్ట్రం కలిమెల ప్రాంతం నుంచి చింతూరు, భద్రాచలం మీదుగా హైదరాబాద్ వెళ్తుంది. ఈ క్రమంలో నెల్లిపాక వద్ద జాతీయ రహదారి నుంచి వై.జంక్షన్ వైపు వెళ్తున్న జామాయిల్ కర్రలు తీసుకెళ్లే ఖాళీ ట్రక్కు ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాను ముందు భాగం, ట్రాక్టర్ ఇంజిన్ భాగం నుజ్జయ్యింది. అయితే వ్యాన్‌లో ఉన్న పశువులను కబేళాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఎటపాక పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకునే లోగా వ్యాన్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. పరారైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని గోవులను గోకవరంలోని గోశాలకు తరలించారు.
A¯]l$-Ð]l*-¯é-çܵ-§ýl íܦ†ÌZ ˘
మహిళ మృతి
తాళ్లరేవు: స్థానికంగా ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది.. కోరంగి ఎస్‌ఐ పి.సత్యనారాయణ, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తాళ్లరేవు శ్రీరామ్‌నగర్‌లో కాలాడి సీత (55), అక్కడి రత్సవారిపేటకు చెందిన ధనకాసులతో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తుంది. వారికి ఒక కుమార్తె ఉంది. శుక్రవారం రాత్రి భోజనం అనంతరం ఫిట్స్ రావడంతో కుప్పకూలి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కొన్ని రోజులుగా సీత అనారోగ్యంతో ఉందన్నారు. కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. ఇలా ఉండగా కుటుంబ సభ్యులు మాత్రం సీత ముఖంపై గాయాలు ఉన్నాయని, ఎవరో హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. పూర్తిగా విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీఐకు మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో క్లూస్ టీంను రప్పించి విచారణ చేపడతామని ఆయన తెలిపారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు నిర్వహించాలని ఎస్‌ఐ సత్యనారాయణను ఆదేశించారు.
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్


