సంక్రాంతి ప్రత్యేక రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా మీదుగా రాకపోకలు సాగించేందుకు దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు మంగళవారం ప్రకటించింది. సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్డు మధ్య 07288/ 07289 నంబర్ రైళ్లు జనవరి 9,10,11,12 తేదీలలో రాకపోకలు సాగించనున్నాయన్నారు. 07290/07291 నంబర్ రైళ్లు సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్డు మధ్య జనవరి 10, 11, 12, 13, 16, 17, 18, 19 తేదీలలో అందుబాటులో ఉంటాయన్నారు. శ్రీకాకుళం రోడ్డు – సికింద్రాబాద్‌కు 07295 రైలు జనవరి 14వ తేదీన, సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్డుకు 07292 నంబర్ రైలు జనవరి 17వ తేదీన, 07293 నంబర్ రైలు శ్రీకాకుళం రోడ్డు – సికింద్రాబాద్‌కు జనవరి 18వ తేదీన అందుబాటులో ఉంటాయని తెలిపారు. వికారాబాద్ – శ్రీకాకుళం రోడ్డుకు 07294 నంబర్ రైలు జనవరి 13న అందుబాటులో ఉంటుందన్నారు. ఇవి రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని రైల్వే స్టేషన్లో ఆగనున్నాయని తెలిపారు.


