గుత్తుల మురళీధరరావు ఆకస్మిక మృతి
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ రాజమహేంద్రవరం నగర ఉపాధ్యక్షుడు గుత్తుల మురళీధరరావు (56) ఆకస్మికంగా మృతి చెందారు. స్థానిక 50వ డివిజన్‌కు చెందిన ఆయన సోమవారం రాత్రి గుండెపోటుకు గురవడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మురళీధరరావు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. విషయం తెలియడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్థానిక సీటీఆర్‌ఐ సమీపాన చోడేశ్వర నగర్‌లోని ఆయన నివాసానికి మంగళవారం చేరుకున్నారు. మురళీధరరావు పార్థివ దేహానికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ ఇన్‌చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డితో పాటు మార్తి లక్ష్మి, కానుబోయిన సాగర్, పోలు విజయలక్ష్మి, బొంతా శ్రీహరి, బర్రే కొండబాబు, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, సప్పా ఆదినారాయణ, సంకిస భవానీప్రియ, నక్కా శ్రీనగేష్, అజ్జరపు వాసు తదితర నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళీధరరావు మృతికి ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రమణ్యం తీవ్ర సంతాపం ప్రకటించారు. మురళీధరరావు అంత్యక్రియలు కోటిలింగాల ఘాట్‌లోని రోటరీ కై లాస భూమిలో మంగళవారం నిర్వహించారు. ఆయన అంతిమ యాత్రలో చెల్లుబోయిన వేణు, జక్కంపూడి రాజా పాల్గొని, స్వయంగా పాడె మోశారు.
పార్టీకి విశేష సేవలు
ఆవిర్భావం నుంచీ వైఎస్సార్ సీపీకి మురళీధరరావు విశేష సేవలందించారు. ఆయన సేవలను గుర్తించిన అధిష్టానం గతంలో నగర పాలక సంస్థ కార్పొరేటర్‌గా అవకాశం ఇచ్చింది. కార్పొరేటర్‌గా గెలిచిన ఆయనను నగర పాలక సంస్థలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపిక చేసింది.
మనసున్న మనిషిని కోల్పోయాం
మురళీధరరావు ఆకస్మిక మరణం తీవ్ర బాధాకరమని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. మంచి నాయకుడిని, మంచి మనసున్న మనిషిని వైఎస్సార్ సీపీ కోల్పోయిందని సంతాపం వ్యక్తం చేశారు. మురళీధరరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మురళీధరరావు పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న మార్గాని భరత్‌రామ్, మేడపాటి షర్మిలారెడ్డి
మురళీధరరావు పాడె మోస్తున్న చెల్లుబోయిన వేణు, జక్కంపూడి రాజా తదితరులు
నేతల సంతాపం
మురళీధరరావు మృతికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేసిన మురళీధరరావు ఆకస్మిక మరణం వైఎస్సార్ సీపీకి తీరని లోటని అన్నారు. 50వ డివిజన్ అభివృద్ధిలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ, మురళీధరరావు మరణం పార్టీతో పాటు వ్యకిగతంగా తనకు తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ నిరంతరం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపి, వైఎస్సార్ సీపీ జెండాను మురళీధరరావు పార్థివ దేహంపై కప్పి నివాళులర్పించారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ, సుశిక్షితుడైన సైనికుడిలా మురళీధరరావు పార్టీ కోసం నిరంతరం పని చేశారని అన్నారు. పార్టీతో పాటు తన డివిజన్ అభివృద్ధికి నిత్యం కృషి చేశారని శ్లాఘించారు.
ఫ గుండెపోటుతో
మరణించిన వైఎస్సార్ సీపీ నేత
ఫ నేతల నివాళి
గుత్తుల మురళీధరరావు ఆకస్మిక మృతి
గుత్తుల మురళీధరరావు ఆకస్మిక మృతి


