405 కేజీల గంజాయి స్వాధీనం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గోకవరం పోలీసులు
గోకవరం: మండలంలోని కామరాజుపేట గ్రామ శివారున ఆగిఉన్న వాహనంలో 405 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం వాహనం అనుమానాస్పద స్థితిలో ఆగి ఉండటాన్ని పిడతమామిడి ఫారెస్టు బీట్ ఆఫీసర్ వీరాబత్తుల రమణ గుర్తించారు. అతన్ని గుర్తించిన వాహనంలో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. దీనిపై ఆయన గోకవరం ఎస్సై పవన్‌కుమార్‌కు సమాచారం అందించగా ఎస్సై సిబ్బందితో అక్కడకు చేరుకుని వ్యాన్‌లో 22 బస్తాల్లో ఉన్న 405 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరకు విలువ రూ.2.05 కోట్లు ఉంటుంది. తహసీల్దార్ రామకృష్ణ ఆధ్వర్యంలో వాహనాన్ని, గంజాయిని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


