రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

Dec 17 2025 6:53 AM | Updated on Dec 17 2025 6:53 AM

రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

చాగల్లు: రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం ఉదయం మృతిచెందినట్టు తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు తెలిపారు. చాగల్లు–పశివేదల రైల్వేస్టేషన్‌ మధ్య రైలు నుంచి జారిపడిన వ్యక్తిని గుర్తించామన్నారు. మృతిచెందిన వ్యక్తి సుమారు 35 నుంచి 40 ఏళ్లు వయస్సు కలిగి, లైట్‌ బ్లూ కలర్‌ ప్యాంట్‌, తెలుపు నీలం పచ్చ పొడుగు చేతుల టీ షర్ట్‌ ధరించి ఉన్నాడన్నారు. మృతిచెందిన వ్యక్తి వివరాల కోసం 94906 17090 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

ఏఎంవో, ఎంఐఎస్‌ కో ఆర్డినేటర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సమగ్ర శిక్ష, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరంలో ఖాళీగా ఉన్న అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి, ఎంఐఎస్‌, ప్లానింగ్‌ కో ఆర్డినేటర్‌ పోస్టులకు ఆసక్తి గలిగిన స్కూల్‌ అసిస్టెంట్‌లు, ఎస్‌జీటీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌, ఎస్‌.సుభాషిణి మంగళవారం తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా ప్రాజెక్ట్‌ కార్యాలయం, సమగ్ర శిక్ష, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం అనే చిరునామాకు పంపాలన్నారు. నోటిఫికేషన్‌, దరఖాస్తు నమూనా, నియమావళికి సంబందిత మండల విద్యాశాఖాధికారి కార్యాలయం, సమగ్ర శిక్ష, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం, రాజమహేంద్రవరం కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఆన్‌లైన్‌లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్‌ఎస్‌ఆర్‌జేవై.ఆర్గ్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. వివరాలకు ఫోన్‌ నంబర్‌ 98667 79398లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement