అన్ని సంఘాలకు ఆదర్శంగా..
ఐకమత్యంగా ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు పూర్వపు కొత్తపేట తాలూకా ప్రభుత్వ పెన్షనర్ల సంఘం సభ్యులు. పెన్షనర్లకు పలు సేవలు అందిస్తూ ఉమ్మడి జిల్లాలో అన్ని సంఘాలకు ఆదర్శంగా నిలిచారు.
ఫంక్షన్ హాలుగా సంఘ భవనం
పూర్వం తాలూకా వ్యవస్థ ఉన్న సమయంలో కొత్తపే ట తాలూకా పరిధిలోని కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, పి.గన్నవరం మండలాలకు చెందిన పలువురు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు సంఘంగా ఏర్పడ్డారు. తొలుత 80 మంది సభ్యులతో ప్రారంభమైన సంఘం నేడు 1,620 మందికి చేరింది. గతంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన మంగిపూడి గౌరీశంకరం, అజ్జరపు వెంకట సుబ్బారావు హయాంలో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మొదట స్థలాన్ని సమకూర్చుకుని, ప్రభుత్వ గ్రాంటులు మంజూరు చేయించుకుని సంఘ భవనాన్ని నిర్మించుకున్నారు. దాతలు, సభ్యు ల విరాళాలతో దశల వారీగా రెండంతస్తు ల నిర్మాణంతో ఫంక్షన్ హాలుగా అభివృద్ధి చేసుకున్నారు.
నేడు సీనియర్ పెన్షనర్లకు సన్మానం
పెన్షనర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం 1946లో జన్మించిన సీనియర్ పెన్షనర్లు 20 మందిని సత్కరించేందుకు పూర్వపు కొత్తపేట తాలూకా ప్రభుత్వ పెన్షనర్ల సంఘంలో ఏర్పాట్లు చేశారు.


