‘మోగ్లీ’ చిత్ర యూనిట్ సందడి
ప్రేక్షకులతో మమేకమైన హీరో, హీరోయిన్
అమలాపురం టౌన్: మోగ్లీ సినిమా హీరో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మండోల్కర్‌తో పాటు చిత్ర యూనిట్ ప్రతినిధులు అమలాపురంలో మంగళవారం సందడి చేశారు. మూడు రోజుల క్రితం ఈ చిత్రం విడుదలై అమలాపుంలో ప్రదర్శితమవుతున్న లలిత థియేటర్‌కు చిత్ర యూనిట్ వచ్చి ప్రేక్షకులతో మమేకమైంది. సినిమా హీరో హీరోయిన్‌తోపాటు సినిమా దర్శకుడు సందీప్‌రాజ్ పాల్గొని సందడి చేశారు. తొలుత చిత్ర యూనిట్‌కు థియేటర్ యాజమాని తోట రాము, సిబ్బంది స్వాగతం పలికారు. సినిమా ప్రదర్శితమవుతున్న వేళ చిత్ర యూనిట్ థియేటర్‌లోకి వెళ్లి ప్రేక్షకులతో మాట్లాడింది. ముఖ్యంగా హీరో, హీరోయిన్, దర్శకుడు సినిమా ఎలా ఉందని ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం థియేటర్ వద్ద హీరో రోషన్, హీరోయిన్ సాక్షి మండోల్కర్ అభిమానుల సమక్షంలో కేక్‌ను కట్ చేశారు. కోనసీమ ప్రజలు కొత్త వారమైన తమకు ఆశీర్వాదాలు అందించాలని ిహీరో, హీరోయిన్ రోషన్, మండోల్కర్ అక్కడికి వచ్చిన అభిమానులను అభ్యర్థించారు. థియేటర్ మేనేజర్ కడలి త్రినాథ్, అనుశ్రీ సినిమాస్ ఏజెంట్ వి.శ్రీనివాస్, టూర్ ఆర్గనైజర్ నిమ్మకాయల దుర్గాప్రసాద్, చిరంజీవి అభిమాన సంఘాల ప్రతినిధులు నల్లా చిట్టి, గుమ్మళ్ల సురేష్ పాల్గొన్నారు.


