గుర్తు తెలియని మృతదేహం స్వాధీనం
అనపర్తి: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని పురుషుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై ఎల్ శ్రీనునాయక్ తెలిపారు. సోమవారం స్థానికు ల సమాచారం మేరకు ఘట నా స్థలానికి వెళ్లి విచారణ చేయగా మూడు రోజుల నుంచి అనపర్తి రైల్వే స్టేషన్ సమీపంలో భిక్షాటన చేసుకుంటూ, రాత్రి సమయంలో స్థానిక వజ్ర కాంప్లెక్స్ బయట పడుకునేవాడని, అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని తెలిసిందన్నారు. సుమారు 50 నుంచి 55 సంవత్సరాల వయసు కలిగి చామన ఛాయ కలిగి ఉన్నాడని లేత పసుపు రంగుపై నిలువు చారలు కలిగిన ఫుల్ హ్యాండ్ షర్టు, బూడిద రంగు ప్యాంటు, తెలుపు నలుపు రంగు కలిగిన చలి కోటు ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని అనపర్తి ఏరియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరచినట్టు చెప్పారు. తెలిసినవారు గాని, బంధువులు గాని అనపర్తి పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్సై నాయక్ కోరారు.


