షటిల్ బ్యాడ్మింటన్‌లో ఆదిత్య రామ్ ప్రతిభ
అమలాపురం టౌన్: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన షటిల్ బ్యా డ్మింటన్ ఇంటర్ యూనివర్సిటీ సెలక్షన్స్‌లో అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన బీబీఏ విద్యార్థి బొంత ఆదిత్య రామ్ సౌత్ జోన్ (సౌత్ ఇండియా) పోటీలకు ఎంపికయ్యాడు. విజయవాడ కేఎల్‌యూలో వచ్చే ఏడాది జనవరిలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీస్ పోటీలకు అర్హత సాధించాడు. విశాఖపట్నంలోని బుల్లయ్య కాలేజీలో ఆదిత్య రామ్ బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
అపురూపం..
రూ.108 నాణెం
అమలాపురం టౌన్: సత్య ప్రమోద తీర్థ స్వామీజీ 108వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం రూ.108 ముఖ విలువతో వెండి నాణేన్ని విడుదల చేసింది. అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ ఈ నాణేన్ని సేకరించారు. దీన్ని 40 గ్రాముల బరువుతో 99.90 శాతం శుద్ధ వెండితో తయారు చేశారు. తొలిసారిగా రూ.108 ముఖ విలువతో ఈ నాణేన్ని భారత ప్రభుత్వం ముద్రించింది. దేశ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ ఉత్తరాది మఠం 41వ పీఠాధిపతిగా సేవ చేసిన సత్య ప్రమోద తీర్థ స్వామీజీ పేరుతో నాణేన్ని ముద్రించారు. నాణేనికి ఒక వైపు రూ.108 ముఖ విలువ, మరో వైపు సత్య ప్రమోద తీర్థ స్వామీజీ చిత్రం కనిపిస్తాయి.
డాబా పైనుంచి పడి మహిళ మృతి
కొత్తపేట: డాబాపై దుస్తులు ఆరేస్తూ ప్రమాదవశాత్తూ కిందపడి ఓ మహిళ మృతి చెందింది. ఎస్సై జి.సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక గణేష్ నగర్‌కు చెందిన గొల్లపల్లి వెంకటలక్ష్మి (40) శనివారం ఉదయం తన డాబాపై దుస్తులు ఆరవేస్తోంది. ఈ క్రమంలో కాలుజారి కిందపడిపోయింది. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు.
షటిల్ బ్యాడ్మింటన్‌లో ఆదిత్య రామ్ ప్రతిభ


