వేగా జ్యుయలర్స్‌లో అద్భుత ఆఫర్లు
రాజమహేంద్రవరం సిటీ: పండగల సందర్భంగా వేగా జ్యుయలర్స్‌లో అద్భుతమైన ఆఫర్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు నిర్వాహకులు శనివారం తెలిపారు. రెండు రాష్ట్రాల్లోని వినియోగదారులకు డిసెంబర్ 15 నుంచి ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయన్నారు. వీటి బ్రౌచర్లను మిరాయ్ సినిమా ఫేమ్ రితిక నాయక్ ఆవిష్కరించారన్నారు. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండగలను వినియోగదారులు మరింత ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ సువర్ణవకాశం కల్పించామని తెలిపారు. ఫ్యాషన్ ఆభరణాల నుంచి ప్రాచీన సంప్రదాయ ఆభరణాల వరకూ తమ షోరూమ్‌లలో అందుబాటులో ఉంచామన్నారు. బంగారు ఆభరణాల తరుగులో 50 శాతం తగ్గింపు ఇస్తున్నామని, పోల్కి ఆభరణాలపై తయారీ, తరుగు చార్జీలు ఉండవన్నారు. వజ్రాభరణాల క్యారట్ ధర కేవలం రూ.49,999 మాత్రమే ఉంటుందన్నారు.


