సాగు.. ముమ్మరం
అనుమతి మేరకు
సాగు చేయాలి
బోర్డు అనుమతించిన మేరకే రైతులు పంట సాగు చేయాలి. పరిమితికి మించి ఉత్పత్తి చేయరాదు. బాడవ భూములు, సైలెన్ భూముల్లో సాగు నిషిద్ధం. మరో రెండు వారాల్లో నాట్లు పూర్తి కానున్నాయి. వేసిన నాట్లు ఆశాజనకంగా ఉన్నాయి. పంట నియంత్రణ పాటించి నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేయాలి.
– జీఎల్‌కే ప్రసాద్, పొగాకు బోర్డు రీజినల్
మేనేజర్, రాజమహేంద్రవరం
దేవరపల్లి: మెట్ట ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంటగా ఉన్న వర్జీనియా పొగాకు సాగు ముమ్మరంగా జరుగుతోంది. 2025–26 పంట కాలానికి బోర్డు బ్యారన్ల రిజిస్టేషన్ చేయడంతో రైతులు సాగు చేపట్టారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ ఏడాది దాదాపు నెల రోజులు ఆలస్యంగా పొగాకు నాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నెలాఖరు వరకూ నాట్లు వేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వరి పంట వేసిన బాడవ భూములు, నల్లరేగడి, సైలెన్ భూముల్లో పొగాకు నాట్లు వేయవద్దని బోర్డు అధికారులు చెబుతున్నా రైతులు పట్టించుకోవడం లేదు. బాడవ, నల్లరేగడి భూముల్లో పొగాకు సాగు చేస్తున్నారు. 2024–25 పంట కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో కొరత ఏర్పడడంతో మన పొగాకుకు మంచి డిమాండ్ వచ్చింది. కిలో గరిష్ట ధర రూ.453 పలికి, రికార్డు సృష్టించడంతో రైతులకు ఊహించని లాభాలు వచ్చాయి. దీంతో, 2025–26 పంట కాలానికి సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచనున్నారు. కొంత మంది జీడిమామిడి తోటలు తొలగించి మరీ పొగాకు సాగు చేస్తున్నారు. బ్యారన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి బ్యాంకులు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ రుణాలు ఇస్తున్నాయి. మోంథా తుపానుకు ముందు వేసిన తోటల్లో సంక్రాంతికి రెలుపులు జరుగుతాయని రైతులు తెలిపారు.
38.59 మిలియన్ కిలోలకే అనుమతి
టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో ఇప్పటి వరకూ 49,629 ఎకరాల్లో పొగాకు నాట్లు వేశారు. మొత్తం 9,991 మంది రైతులు 11,290 బ్యారన్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బోర్డు 38.59 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తికి మాత్రమే అనుమతి ఇచ్చింది. 2024–25 పంట కాలంలో 12,879 మంది రైతులు, 14,994 బ్యారన్లను రిజిస్ట్రేషన్ చేయించుకుని 26,336 హెక్టార్లలో పంట సాగు చేశారు. అప్పట్లో 61.27 మిలియన్ కిలోలకు మాత్రమే అనుమతి ఇవ్వగా, 83.88 మిలియన్ కిలోల ఉత్పత్తి జరిగింది.
వేలం కేంద్రాల వారీగా పొగాకు నాట్ల వివరాలు (ఎకరాలు)
వేలం కేంద్రం వేసిన బ్యారన్ల
నాట్లు రిజిస్ట్రేషన్లు
దేవరపల్లి 8,405 2,153
జంగారెడ్డిగూడెం–1 11,017 2,231
జంగారెడ్డిగూడెం–2 6,137 2,014
కొయ్యలగూడెం 12,400 2,588
గోపాలపురం 10,640 2,301
·˘ gZÆý‡$V> Ð]lÈj°Ä¶æ* ´÷V>MýS$ ¯ér$Ï˘
·˘ 48,599 GMýSÆ>ÌZÏ ç³NÇ¢
·˘ 11,290 »êÅÆý‡¯]lÏ Çh{õÜtçÙ¯ŒS
·˘ OÆð‡™èl$Ë$ 9,991 Ð]l$…¨
సాగు.. ముమ్మరం


