కరుణించవమ్మా.. కాపాడవమ్మా..
సారె తీసుకువస్తున్న మద్ది ఆంజనేయస్వామి ఆలయ ఈఓ, వేద పండితులు
సారె తెస్తున్న నంగాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు
నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి తిరునాళ్లు రెండో రోజైన శుక్రవారం ఘనంగా జరిగాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయస్వామి దేవస్థానం ఈఓ ఆర్‌వీ చందన, నిడదవోలు గ్రామ దేవత నంగాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు ఆధ్వర్యాన కోటసత్తెమ్మ తల్లికి చీర, సారె సమర్పించారు. ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్యప్రకాష్ పర్యవేక్షణలో కోటసత్తెమ్మ అమ్మవారిని ప్రధానార్చకుడు అప్పారావుశర్మ ప్రత్యేకంగా అలంకరించి, కుంకుమ పూజలు, హోమాలు నిర్వహించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తమను కరుణించి, కాపాడాలని వేడుకున్నారు.
– నిడదవోలు రూరల్
కరుణించవమ్మా.. కాపాడవమ్మా..


