మెగా పీటీఎం.. విద్యార్థులకు నీరసం
కడియం: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ – టీచర్స్ మీట్ (పీటీఎం) కారణంగా శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థులకు భోజనాలు ఆలస్యం చేశారు. సాధారణంగా మధ్యాహ్నం 12 గంటలకు విద్యార్థులు భోజనం చేస్తారు. అటువంటిది 2 గంటలకు కానీ పెట్టకపోవడంతో వారు ఆకలితో అలమటించిపోయారు. ప్రజాప్రతినిధులు, అధికారులు రావడం ఆలస్యం కావడంతో పాటు, ఆయా పాఠశాలల్లో తగిన విధంగా సమయ పాలన పాటించలేదని తెలుస్తోంది. దీంతో, అప్పటి వరకూ విద్యార్థులు నీరసంగా వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ఈ సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ తల్లిదండ్రులు అతి తక్కువగానే హాజరయ్యారు. దుళ్ల హైస్కూల్లో జరిగిన సమావేశంలో కడియం ఇన్‌స్పెక్టర్ ఎ.వెంకటేశ్వరరావు పాల్గొని చట్టాలపై అవగాహన కల్పించారు. కడియంలో ఎస్సై ప్రసన్న మాట్లాడుతూ, బాల్య వివాహాలను అరికట్టాలని అన్నారు. కార్యక్రమంలో కడియం ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, తహసీల్దార్ సునీల్, ఎంపీడీఓ రమేష్, విద్యాశాఖాధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఫ మధ్యాహ్నం 2 గంటలకు భోజనాలు
ఫ ప్రజాప్రతినిధులు,
అధికారుల రాకలో జాప్యమే కారణం


