జజర చిత్రీకరణలో తాళ్లూరు మఠం అర్చకులు
గండేపల్లి: మండలంలోని తాళ్లూరు మఠంలో శుక్రవారం జరిగిన జజర చిత్రం షూటింగ్‌లో తాళ్లూరు మఠం అర్చకులు భాగస్వాములయ్యారు. సినీమా హీరో చందు చిననాటి సన్నివేశాలను దర్శకుడు ప్రభు చిత్రీకరించారు. హీరో తండ్రి చరణ్‌రాజ్ విదేశాలకు వెళుతూ తన కొడుకు ను మఠం అర్చకులకు అప్పగించే సన్నివేశాన్ని చిత్రీకరీంచారు. అనంతరం చరణ్‌రాజ్, దర్శకుడు మఠం అర్చకుడి ఫొటోలు తీసుకున్నారు. హీరో చందు చిననాటి సన్నివేశాలలో బాలనటుడు యశ్వంత్‌తో చిత్రీకరించారు. చరణ్‌రాజ్‌ను చూసేందుకు గ్రామస్తులు ఉత్సాహం చూపారు.


