ముద్రగడ అనుభవం పార్టీకి అవసరం
కిర్లంపూడి: మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం రాజకీయ అనుభవం వైఎస్సార్ సీపీకి ఎంతో అవసరం అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు అన్నారు. శుక్రవారం కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకుని ఆయనను కలిశారు. ఆయనతో పాటు రాజమహేంద్రవరం వైఎస్సార్ సీపీ పార్లమెంట్ ఇంచార్జి గూడూరి శ్రీనివాస్, గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, తోట రామకృష్ణ ముద్రగడను కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక చర్యలపై వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటాలను విజయవంతం చేసేందుకు తీసుకోవలసిన అంశాలపై చర్చించారు. అనంతరం వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు నుంచి నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.


