మోంథా మోత మితమే! | - | Sakshi
Sakshi News home page

మోంథా మోత మితమే!

Nov 8 2025 7:44 AM | Updated on Nov 8 2025 7:44 AM

మోంథా

మోంథా మోత మితమే!

ఎకరాకు రూ.25 వేల

పరిహారం ఇవ్వాలి

మోంథా తుపాను రైతులను తీవ్రంగా నష్టాలకు గురి చేసింది. వరి, ఉద్యాన పంటలు దెబ్బతిని రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. కూటమి ప్రభుత్వం పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందించి ఆదుకోవాలి. ప్రభుత్వం తూతూ మంత్రంగా పరిహారం ఇస్తే కుదరదు. ఎకరం వరికి రూ.25 వేలు, ఉద్యాన పంటలకు ఎకరానికి రూ.50 వేల పరిహారం అందించాలి. రైతులకు షరతులు లేకుండా బ్యాంకు నుంచి సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలి. పొలంలో ఎవరు సాగు చేస్తుంటే వారి పేరుమీదే నష్టపరిహారం ఇవ్వాలి.

– తలారి వెంకట్రావు, వైఎస్సార్‌ సీపీ

కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే

నమోదులో నిబంధనలు తగవు

పంట నష్టం నమోదులో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. పంట నష్టపోయిన రైతులందరి పేర్లు నమోదు చేయలేదు. 33 శాతం కంటే ఎక్కువ నష్టపోతే మాత్రమే నమోదు చేసింది. నష్టపోయిన వరి రైతులకు హెక్టారుకు రూ.25 వేలు ఇస్తామంటున్నారు. ఆ రైతు ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని నిబంధన పెట్టడం దారుణం. 33 శాతం పంట నష్టం నమోదు చేసినప్పుడు.. ఆ రైతు పండించిన మిగిలిన ధాన్యానికి సంబంధించి డబ్బులు పరిహారంలో కలిపి ఇవ్వాలి. లేదంటే 33 శాతానికి పైగా పరిహారం, అదే సర్వే నంబర్‌లో రైతు పండించిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి.

– పరిమి సోమరాజు, వైఎస్సార్‌ సీపీ

రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి

సాక్షి, రాజమహేంద్రవరం: మోంథా తుపాను కర్షకులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. దాని ప్రభావంతో రెండు రోజులుగా వీచిన భారీ ఈదురు గాలులు, వర్షాలకు ప్రజలు, రైతులు అతలాకుతలం అయ్యారు. తుపాను ప్రభావంతో జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. వరి, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేల ఎకరాల్లో వరి నేలకొరిగింది. గృహనిర్మాణ, వ్యవసాయ, ఆర్‌అండ్‌బీ, రహదారులు, విద్యుత్‌ తదితర శాఖలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇలాంటి తరుణంలో రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నాల్లో పడింది. పంట నష్టం అందించేందుకు అనేక నిబంధనలు తెరపైకి తెచ్చింది. పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వకుండా తూతూ మంత్రంగా అందించి మమ అనిపించే ప్రకియను ఆచరణలోకి తెస్తోంది. ఇందుకు ఇటీవల జరిగిన పంట నష్టపరిహారం అంచనాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినా.. పరిమిత సంఖ్యలో మాత్రమే నష్టాన్ని నమోదు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంట నష్టం ప్రాథమిక అంచనాలకు.. వాస్తవ అంచనాలకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. పంట నష్ట పరిహారాన్ని పొందే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయమబోమని చెప్పడంతో వారు లబోదిబోమంటున్నారు. కేవలం వ్యవసాయ, ఉద్యాన శాఖలకు సంబంధించిన నష్టం లెక్కలు మాత్రమే ప్రభుత్వానికి సమర్పించారు. మిగిలిన శాఖలు ఎప్పుడు పంపుతాయో అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

వ్యవసాయ రంగానికి రూ.40 కోట్ల నష్టం

● తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మోంథా తుపా ను నష్టాలపై అధికారులు తుది నివేదిక ప్రభుత్వానికి పంపారు. వ్యవసాయ, ఉద్యాన పంటల కు సంబంధించి 18 మండలాల పరిధిలో 33,262 మంది రైతులు నష్టపోయినట్లు నివేదిక రూపొందించారు. మొత్తం 16,540 హెక్టార్లలో వివిధ రకా ల పంటలు నష్టపోగా.. వాటి విలువ రూ.40.96 కోట్లుగా నిర్ధారించారు. 31,074 మంది రైతులకు చెందిన వరి, మినుముకు సంబంధించి 15,738. 607 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. దీని విలువ రూ.38,21,07,405 కోట్లుగా పేర్కొన్నారు.

● జిల్లాలో ఏడు రకాల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. రాజానగరం, రంగంపేట, సీతానగరం, కొవ్వూరు, చాగల్లు, నల్లజెర్ల, పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, తాళ్లపూడి, గోపాలపురం, దేవరపల్లి గ్రామాల్లో అత్యధికంగా పంట నష్టం జరిగింది. 14 మండలాల్లో 802.193 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. 2,153 మంది రైతులకు సంబంధించి రూ.2,75,77,692 కోట్లు నష్టం జరిగినట్లు తేల్చారు.

నష్ట పరిహారం ఇలా..

తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటలకు పరిహారం కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వరి పంటలకు హెక్టారుకు రూ.25 వేలు, మినుము పంటకు హెక్టారుకు రూ.17 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది.

అంచనాల్లో వంచన

తుపాను నష్టం అంచనాల్లో కూటమి సర్కారు వంచనకు పాల్పడినట్లు రైతులు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 31,074 మంది రైతులకు చెందిన 47,740 పొలాలు సర్వే చేపట్టారు. 15,742.53 హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు అంచనాలు రూపొందించారు. 15,667.56 హెక్టార్లకు ఆమోదముద్ర వేశారు. 74.96 హెక్టార్లు తిరస్కరించారు. వరి 14,602.83 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు నివేదిక సిద్ధం చేశారు. మినుము 1135.777 హెక్టార్లలో నష్టపోయినట్లు వెల్లడించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రాథమిక నష్టం అంచనాకు.. తుది నివేదికకు భారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 25 వేల హెక్టార్లకు పైగా వరికి నష్టం వాటిల్లినా.. కేవలం 15 వేల హెక్టార్లు మాత్రమే నమోదు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. పంట నష్టం అంచనా వేసే అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లకుండానే ఆయా మండల కార్యాలయాల్లో కూర్చొని నివేదికలు సిద్ధం చేసినట్లు ఆరోపణలున్నాయి.

ధాన్యం కొనుగోలుకు నిరాకరణ

తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి వాటిని ఆరబెట్టుకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. ఇలాంటి సమయంలో అండగా నిలవాల్సిన కూటమి సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. పైగా పంట నష్ట పరిహారానికి దరఖాస్తు చేసుకున్న రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోలు చేయబోమంటూ స్పష్టం చేసింది. దీంతో తాము ఎవరికి ధాన్యం విక్రయించుకోవాలో తెలియక రైతులు అల్లాడుతున్నారు. ఇప్పటికే తడిసిన ధాన్యాన్ని తక్కువ ధరకు దళారులకు తెగనమ్ముకుంటున్న సందర్భంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం కొనాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే తాము తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని, పంట సాగుకు పెట్టిన పెట్టుబడులు సైతం చేతికందవని ఆవేదన చెందుతున్నారు.

మిగిలిన వాటి పరిస్థితేంటో..?

జిల్లాలో వ్యవసాయంతో పాటు రహదారులు, ఇళ్లు, దెబ్బతిని ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. 56 ఇళ్లు నేటమట్టం కాగా రూ.28 లక్షలు నష్టం జరిగినట్లు నిర్ధారించారు. విద్యుత్‌ శాఖకు రూ.37.34 లక్షలు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా రూపొందించారు. 48 రహదారులు ధ్వంసం కాగా.. రంగంపేటలో రూ.6.26 కోట్లు, బిక్కవోలు రూ.4.04 కోట్లు, రాజానగరంలో రూ.16.00 కోట్ల విలువైన రహదారులు దెబ్బతిన్నా యి. 33 పంచాయతీరాజ్‌ రహదారులు దెబ్బతినగా.. ఇందుకు గాను రూ.45.81 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 21 మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకులు, చెరువులకు నష్టం వాటిల్లింది. వీటి విలువ రూ.6.87 కోట్లుగా లెక్కగట్టారు. వీటి పరిస్థితి ఏంటన్న ప్రశ్న వెల్లువెత్తుతోంది.

నష్టం నమోదులో ప్రభుత్వం గిమ్మిక్కులు

పరిహారం తక్కువ ఇచ్చేందుకు ఎత్తుగడలు

33 శాతం కన్నా ఎక్కువ నష్టానికే పరిహారం!

ప్రస్తుతం రూ.40 కోట్ల పంట నష్టం

ప్రభుత్వానికి నివేదిక పంపిన అధికారులు

నిర్లిప్తంగా మిగిలిన శాఖల అధికారులు

ముంచిన నూతన నిబంధనలు

పంట నష్ట పరిహారంలో కోత విధించేందుకు ప్రభుత్వం నూతన నిబంధనలు తెరపైకి తెచ్చింది. 33 శాతానికి పైగా పంట నష్టపోయి ఉంటే మాత్రమే నమోదు చేశారు. అంతకంటే తక్కువ నష్టపోతే నమోదుకు ససేమిరా అన్నారు. జిల్లాలో అత్యధిక శాతం 33 శాతం కంటే తక్కువగా పంట నష్టం వాటిల్లింది. సుమారు 10 వేల హెక్టార్లకు పైగా ఇదే పరిస్థితి నెలకొంది. వీరి పరిస్థితేంటో అర్థం కావడం లేదు. తమను ఎవరు ఆదుకుంటారని రైతులు ఆవేదన చెందుతున్నారు.

మోంథా మోత మితమే!1
1/5

మోంథా మోత మితమే!

మోంథా మోత మితమే!2
2/5

మోంథా మోత మితమే!

మోంథా మోత మితమే!3
3/5

మోంథా మోత మితమే!

మోంథా మోత మితమే!4
4/5

మోంథా మోత మితమే!

మోంథా మోత మితమే!5
5/5

మోంథా మోత మితమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement