మార్తాండవానికి మంచుతెర
నిన్న మొన్నటి వరకు మండి పడిన మార్తాండుడు నేడు మంచు తెరలకు ఆవలే గజగజలాడుతూ బజ్జున్నాడు. మబ్బులు కమ్ముకున్నా.. మంచు తెరలు ముసిరినా దినకరుడు బద్దకిస్తాడేమో కానీ.. రెక్కాడితే కానీ డొక్కాడని కష్టజీవికి ఎలా కుదురుతుంది. ఎముకలు కొరికే చలిలోనైనా ముందుకు సాగాల్సిందే కదా. శుక్రవారం ఉదయం 9 గంటలైనా రవికిరణాలు నేలతల్లిని తాకలేకపోయాయి. రహదారులపై బాటసారులు, వాహన చోదకులకు ముందున్నది కనపడక అవస్థలు పడ్డారు. లైట్ల వెలుగులో ముందుకు సాగిపోయారు. మరో వైపు మంచందాలు మనసున్న మనుషులను మైమరపించాయి. – పెరవలి
అన్నవరప్పాడులో మంచులో అంతంత మాత్రంగా కనిపిస్తున్న సూర్యుడు
అన్నవరప్పాడులో మంచు తెరలలో వేంకటేశ్వరస్వామి ఆలయం
పిట్టల వేమవరం వద్ద జాతీయ రహదారిపై సైకిళ్లపై వస్తున్న రైతులు
మార్తాండవానికి మంచుతెర
మార్తాండవానికి మంచుతెర


