ఏపీ వాలీబాల్ జట్టు మేనేజర్‌గా గంగాధరరావు
చాగల్లు: జాతీయ స్థాయి అండర్ –17 వాలీబాల్ పోటీల్లో రాష్ట్ర బాలుర జట్టు మేనేజర్‌గా ఊనగట్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామోపాధ్యాయుడు కొయ్య గంగాధరరావు నియమితులయ్యారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్‌వీ రమణ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటనలో తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈనెల 11 నుంచి 15 వరకూ ఈ పోటీలు జరుగుతాయి. ఈ సందర్భంగా గంగాధరరావును పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నందిగం శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షుడు బి.శివ నాగేంద్ర, ఎస్‌ఎంసీ చైర్మన్ కామన శివ, ఉపాధ్యాయులు అభినందించారు.
ప్రాణం తీసిన అతి వేగం
నిడదవోలు రూరల్: బైక్‌పై వేగంగా వెళుతున్న ముగ్గురు స్నేహితులు అదుపు తప్పి ఆర్వోబీ ఫుట్‌పాత్‌ను ఢీకొన్నారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు తెలిపిన వివరాల ప్రకారం.. చాగల్లు మండలం మార్కొండపాడుకు చెందిన నామన కోట సత్యనారాయణ (19), మల్లవరం గ్రామానికి చెందిన అరిగెల సాయిదుర్గ, నాగిరెడ్డి మంగేస్కర్ మోటారు సైకిల్‌పై గురువారం అర్ధరాత్రి టిఫిన్ కోసం కొవ్వూరు వెళ్లి అక్కడి నుంచి విజ్జేశ్వరం చేరుకున్నారు. అక్కడ కూడా టిఫిన్ లేకపోవడంతో నిడదవోలు మీదుగా ఇంటికి బయలుదేశారు. ఈ క్రమంలో తెల్లవారుజాము ఐదు గంటల సమయంలో సమిశ్రగూడెం – నిడదవోలు ఆర్వోబీ వంతెనపై ఫుట్‌పాత్‌ను వేగంగా ఢీకొన్నారు. దీంతో కోట సత్యనారాయణకు తలకు తీవ్ర గాయమై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సాయిదుర్గ, మంగేస్కర్‌లకు తీవ్ర గాయాలు కావడంతో రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యసేవలందిస్తున్నారు. కోట సత్యనారాయణ, సాయిదుర్గ కోత మెషీన్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. మంగేస్కర్ డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా డు. మంగేస్కర్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
గండేపల్లి: గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 3,73,500 విలువైన కారు, మూడు సెల్ ఫోన్లు, 2 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాకు చెందిన తాకు నరసింహసింగ్, పున్నాన తేజ, మహిందర్ సింగ్‌లు 21.7 కేజీల గంజాయిని 11 ప్యాకెట్లలో ప్యాక్ చేసి కారులో తరలిస్తున్నారు. గండేపల్లి మండలం ఎన్టీ రాజాపురం రోడ్డులో శుక్రవారం వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్సై యూవీ శివ నాగబాబు, సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పెద్దాపురం కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కాగా.. నరసింహసింగ్‌పై 4, తేజ పై 8, మహిందర్ సింగ్‌పై 3 దొంగతనం కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే మరో 13 మందికి దీనిలో ప్రమేయం ఉందని, వారిపై తొందరలోనే చర్యలు తీసుకుంటామన్నారు.
ఏపీ వాలీబాల్ జట్టు మేనేజర్‌గా గంగాధరరావు
ఏపీ వాలీబాల్ జట్టు మేనేజర్‌గా గంగాధరరావు


