శనైశ్చరునికి వెండి జటాజూటం సమర్పణ
కొత్తపేట: మందపల్లిలోని మందేశ్వర (శనైశ్చర) స్వామికి కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన చిన్నె శ్రీనివాసరావు, లక్ష్మి దంపతులు నాగాభరణంతో కూడిన జటాజూటాన్ని సమర్పించారు. 3,180 కేజీల వెండితో తయారు చేయించిన ఈ ఆభరణానికి సుమారు రూ.5 లక్షలు ఖర్చయినట్టు తెలిపారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం ఽగ్రామ పెద్దలు, ధర్మకర్తల మండలి సభ్యులు, వేద పండితులు, భక్తుల సమక్షంలో దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్‌బాబుకు అందజేశారు. దానికి ఆలయ అర్చకులు, వే ద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వా మివారికి అలంకరించారు. అనంతరం శ్రీనివాస రావు, లక్ష్మి దంపతులను దేవస్థానం తరఫున ఈ ఓ సురేష్ బాబు, దేవస్థానం మాజీ చైర్మన్ చింతం విజయకృష్ణ మోహన్ ఘనంగా సత్కరించారు.


