హ్యుందాయ్ వెన్యూ ఆవిష్కరణ
రాజమహేంద్రవరం రూరల్: హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ విడుదల చేసిన సరికొత్త వెన్యూ కారును బుధవారం రాజమహేంద్రవరంలోని లక్ష్మీ హ్యుందాయ్ షోరూమ్‌లో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎంఐఎల్ రీజినల్ పార్ట్స్ అండ్ సర్వీస్ మేనేజర్ బి.మనోజ్ మాట్లాడుతూ కొత్త కారు 3,995 మిల్లీమీటర్ల పొడవు, 1800 మిల్లీమీటర్ల వెడల్పు, 1,665 మిల్లీమీటర్ల ఎత్తు ఉంటుందన్నారు. సరికొత్త డిజైన్, 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశారని వివరించారు. 1.2 లీటర్ కప్పా పెట్రోల్, 1.0 లీటర్ టర్బో ఎఈజీ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ వేరియంట్లు విడుదల చేశారని తెలిపారు. ఆరు మోనోటోన్, రెండు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లను అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో లక్ష్మీగ్రూప్ రాజమండ్రి హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్‌ఎన్‌వీ సునీల్ కుమార్, సిబ్బంది వీరేష్, గోపి, రవి కుమార్, కోటేశ్వరరావు, దుర్గారావు, సుమంత్, మురళీ, కృష్ణమోహన తదితరులు పాల్గొన్నారు.


