హాకీ వందేళ్ల ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
బాలాజీచెరువు (కాకినాడ): హాకీ వందేళ్ల ఉత్సవాల్లో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాలో నవంబర్ 7వ తేదీన ఒక మెన్ హాకీ మ్యాచ్, ఒక వుమెన్ హాకీ మ్యాచ్ నిర్వహించాలని హాకీ ఇండియా ఆదేశించిందని ఏపీ హాకీ జాయింట్ సెక్రటరీ వి.రవిరాజు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆ వివరాలను వెల్ల డించారు. దీనిలో భాగంగా హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పోటీలు జరుగుతాయన్నారు. కాకినాడలోని ఆస్ట్రో టర్ఫ్ హాకీ ఫీల్డ్‌లో ఆ రోజు ఉదయం ఏడు గంటలకు సీనియర్ మహిళలు, పురుషుల హాకీ పోటీలు ప్రారంభమవుతాయన్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఫ్లడ్‌లైట్స్‌లో సీనియర్ హాకీ క్రీడాకారులు, సూపర్ సీనియర్ హాకీ క్రీడాకారులతో మ్యాచ్ ఆడుతారని తెలిపారు. కాగా.. హాకీ వందేళ్ల ఉత్సవాల పోస్టర్‌ను బుధవారం కలెక్టర్ సగిలి షణ్మోహన్ ఆవిష్కరించారు.


