దిగుబడులపై ప్రభావం
వాతావరణం అనుకూలించడం లేదు. దుక్కులు పాడవడంతో మళ్లీ సిద్ధం చేస్తున్నాం. ఎకరానికి రూ.8 వేలు అదనంగా ఖర్చవుతుంది. ఈ ఏడాది నాట్లు నెల రోజులు ఆలస్యంగా జరుగుతున్నాయి. తుపాను ముందు వేసిన తోటలు దెబ్బ తిన్నాయి. దీంతో, వాటిని దున్ని మళ్లీ నాట్లు వేస్తున్నాం. వరద నీటికి పొలాల్లో ఇసుక మేటలు వేసి, మొక్కలు కొట్టుకు పోయాయి. నారు కొరత ఏర్పడుతుంది. మొక్కలను కాపాడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం. చాలా మంది రైతులు వేసిన తోటలను దున్నేస్తున్నారు. నాట్లు ఆలస్యమైతే దిగుబడులు తగ్గుతాయి.
– పిన్నమనేని మధుమోహన్, రైతు,
చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం
తుపాను ప్రభావంతో..
మోంథా తుపాను ప్రభావంతో ఈ ఏడాది పొగాకు నాట్లు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ 1,050 హెక్టార్లలో మాత్రమే వేశారు. ఈ నెలాఖరుకు నాట్లు ముమ్మరంగా జరుగవచ్చు. రెండు రోజులుగా వాతావరణం అనుకూలించడంతో దుక్కులు సిద్ధం చేస్తున్నారు. రీజియన్‌లో పొగాకు సాధారణ సాగు విస్తీర్ణం 29,480 హెక్టార్లు. పరిమితికి మించి సాగు చేయడం అనర్థదాయకం. బ్యారన్‌కు 1.75 హెక్టార్లలో మాత్రమే సాగు చేయాలి. నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేసి, లాభాలు పొందాలి.
– జీఎల్‌కే ప్రసాద్, రీజినల్ మేనేజరు,
పొగాకు బోర్డు, రాజమహేంద్రవరం


